Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హ్యాప్తీ బర్త్‌డే'. 'మత్తువదలరా' ఫేమ్ రితేేష్రానా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది. మంగళవారం మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. వినూత్నంగా, పూర్తి కామెడీ ప్రధానంగా ఉన్న ఈ టీజర్ అందరిని ఇంప్రెస్ చేసింది. యూనియన్ మినిష్టర్ రోల్లో వెన్నెల కిషోర్ సంభాషణలు, గన్‌బిల్లును ఆమోదించడం, ఇంటికొక గన్ పాలసీని ప్రతిపాదించడం, లావణ్య త్రిపాఠి పోల్ డ్యాన్స్, సత్య స్టయిలిష్ వాక్ వంటి తదితర సన్నివేశాలు టీజర్లో ఎంతో వినోదాత్మకంగా కనిపించి, చిత్రంపై అంచనాలు పెంచాయి. కాలభైరవ నేపథ్య సంగీతం, సురేష్ సారంగం కెమెరాపనితనం టీజర్‌ను మరింత ఆసక్తిగా కనిపించేలా చేశాయని చిత్ర యూనిట్ తెలిపింది.