Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి తరానికే కాదు.. భవిష్యత్ తరాలకు సైతం మూవీ మొఘల్ డా|| డి.రామానాయుడిగారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని వేరే చెప్పక్కర్లేదు. సోమవారం ఆయన 86వ జయంతిని పురస్కరించుకుని నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, కూనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు నిర్మాతల మండలి హాలులో జరిగిన ఈ వేడుకలో రామానాయుడుగారి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పని చేసిన దర్శకులు బోయిన సుబ్బారావు, వై.నాగేశ్వరరావు, కె.సదాశివరావు, జయంత్ సి పరాన్జీ, కాశీవిశ్వనాథ్, ముప్పలనేని శివ, చంద్ర మహేష్, వి.యన్.ఆదిత్య, పి.సునీల్ కుమార్ రెడ్డితోపాటు రామానాయుడి గారి జీవితం గురించి 'మూవీ మొఘల్' పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయక రావును డాక్టర్ రామానాయుడు స్మారక పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ, వి.విజయేంద్ర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకష్ణ, కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఖాజా సూర్యనారాయణ, నిర్మాతలు ఏ. గురురాజ్, పి.సత్యారెడ్డి, వి.వి.ఋషిక తదితరులు పాల్గొని రామానాయుడు గారికి ఘనంగా నివాళి అర్పించి, ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. జె.వి.మోహన్‌గౌడ్, పి.విజయ వర్మ, కూనిరెడ్డి శ్రీనివాస్, బాబ్జీ నిర్వహించిన ఈ కార్యక్రమం అరుదైన కార్యక్రమంగా అందరినీ ఆకట్టుకుంది.