Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిగున్ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'కిరాయి'. ఎస్ఎవై క్రియేషన్స్, ఏఆర్కెఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకంపై వి.ఆర్.కె దర్శకత్వంలో అమూల్యరెడ్డి యలమూరి, నవీన్‌రెడ్డి వుయ్యూరు నిర్మిస్తున్నారు. బుధవారం త్రిగున్ బర్త్ డే సందర్బంగా అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రంలోని రస్టిక్, రగ్గడ్‌గా ఉన్న హీరో త్రిగున్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'త్రిగున్ మంచి ఎనర్జీటిక్ హీరో. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చాలా బాగుంది. తను మొదటి సారి డిఫరెంట్ సబ్జెక్ట్‌ని అట్టెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు.
దర్శకుడు వి.ఆర్.కె (రామకష్ణ) మాట్లాడుతూ,'1995, 2003, 2020ల్లో గుంటూరు, పల్నాడులో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగాయి. గుంటూరు బ్యాక్ డ్రాప్లో ఉండే ఈ సినిమాలో హీరో కిరాయి తీసుకోకుండా ఓ కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?, ఈ క్రమంలో ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ కథ. హీరో త్రిగున్‌కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్గా ఈ సినిమా రష్, ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగుందని మెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. హెవీ యాక్షన్‌తో ఆడియెన్స్‌కు థ్రిల్ ఇవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది' అని చెప్పారు.
'ఈ సినిమా కోసం గుంటూరు సబ్ జైలు, చంచల్ గూడ, చర్లపల్లి జైళ్ళలో కిరాయి హత్యలు చేసినవారి గురించి రీసెర్చ్ చేశాం. వీళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు..ఎన్నో సమస్యలు ఉంటాయని తెలిసింది. వాటిని ప్రేక్షకులు మెచ్చేలా మా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు' అని నిర్మాత అమూల్య రెడ్డి యలమూరి అన్నారు.