Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుంద రానికీ'. ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఇందులో నాని తండ్రిగా నటించిన నరేష్ మీడియాతో ముచ్చటించారు.
'ఈ ఎరాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లల నుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. 'అ..ఆ', 'భలేభలేమగాడివోరు', 'సమ్మోహనం' వంటి సినిమాలు బెస్ట్ ఫాదర్‌గా నిలిపాయి. ఇందులో చేసిన ఫాదర్ పాత్ర ది బెస్ట్ అని చెప్పగలను. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దర్శకుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మధ్య కుదిరిన మంచి కామెడీ టైమింగ్. ఎమోషన్‌ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే పాత్ర. కీలకమైన పాత్ర ఇది. గతంలో జంథ్యాల గారి సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు చేశాను. ఆ తర్వాత ఇప్పుడు చేశాను. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక నాని, నా కాంబినేషన్ అదిరిపోయిందని చాలామంది చెప్పారు. హీరోయిన్ నజ్రియా కూడా మలయాళంలో స్టార్. తను కూడా బాగా చేసింది. మైత్రీ మూవీస్ మంచి కుటుంబకథా చిత్రాలకు ఆణిముత్యంలాంటి సంస్థ ఇది. మైత్రీ నుంచి వచ్చిన 'పుష్ప', 'సర్కారువారి పాట' విజయాల సరసన ఈ సినిమా కూడా నిలుస్తుంది' అని నరేష్ చెప్పారు.