Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గూఢచారి' చిత్రంతో సక్సెస్ పుల్ దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన శశికిరణ్ తిక్క 'మేజర్'తో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితాన్ని వెండితెర పై ఆవిష్కరించడంలో ఆయన చూపిన ప్రతిభకు అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు అన్ని ఇండిస్టీ నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,''మేజర్' చిత్రానికి వస్తున్న స్పందన ఎంతో సంతప్తినిస్తోంది. గౌరవాన్ని తెచ్చి పెట్టి, గర్వంగా ఫీలయ్యే సినిమా చేశాం. 'విక్రమ్', 'పథ్వీరాజ్' చిత్రాలతో చూస్తే మాది చిన్న చిత్రం. అయినా వాటితో పాటే ఆదరణ పొందుతోంది. ఈ సినిమా ప్రివ్యూ చూశాక మేజర్ సందీప్ వాళ్ల అమ్మగారు నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేం ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది. బాలీవుడ్ దగ్గర్నుంచి మొదలు తెలుగు సినిమా ఇండిస్టీ వరకూ మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. అడివిశేష్‌తో నాకు మంచి స్నేహం ఉంది. 'గూఢచారి' సినిమా చేసినా, 'మేజర్'కి పనిచేసినా ఇద్దరం కలిసే వర్క్ చేశాం. నాకు పేరు కంటే సంతప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ఆ రెండూ నాకు దక్కాయి. ఈ సినిమాకు వచ్చిన పేరు, గుర్తింపుతో ఇకపై చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేస్తాను. ప్రస్తుతం సితార ఎంటర్టైన్ మెంట్స్‌లో ఓ సినిమాకి ఒప్పందం కుదిరింది. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉంది' అని అన్నారు.