Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ గ్లింప్స్‌ని చిత్ర బృందం బుధవారం రిలీజ్ చేసింది. ముప్పై సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్, సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్‌లో ఉన్నారు.
హీరో గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈనెల 12న ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు కర్నూల్లో భారీ ఆడియో రిలీజ్ వేడుకని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 1న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నాయికగా నటించింది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా ఈ చిత్ర టికెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు హామీ ఇచ్చిన విషయం విదితమే.