Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకుడు. ఐ.వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో రిలీజ్‌కి సిద్ధమవు తోంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం అగ్ర కథానాయకుడు బాలకష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''చోర్ బజార్' ట్రైలర్ చాలా బాగుంది. టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. 'పైసా వసూల్' సినిమా నుంచి పూరి జగన్నాథ్ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆకాష్ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. కొత్తగా, భిన్నంగా ఉన్న చిత్రాలకు అందరి ఆదరణ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటి కొత్త తరహా సినిమా అవుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.
'ఈ చిత్ర ట్రైలర్లో బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్‌తో మాస్ బాడీ లాంగ్వేజ్‌తో హీరో ఆకాష్ పూరి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా. నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడంతో దర్శకుడు జీవన్ రెడ్డిఈచిత్రానికి కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.