Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విక్రమ్'లో నటీనటులు, ఫైట్ మాస్టర్, సంగీత దర్శకుడు వీరంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మొదటి భాగంలో కమల్ కనిపించరు. కానీ తానున్నట్లు గ్రిప్పింగ్లో పెట్టాడు. ఫైనల్లో సూర్యను తెచ్చి హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో కామెడీ, పాటలు ఏమీ లేవు. అయినా థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోపెట్టాడంటే అదంతా దర్శకుని స్రీన్ల్ప్లే కారణం' అని నిర్మాత, పంపిణీదారుడు ఎన్.సుధాకర్‌రెడ్డి చెప్పారు.
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఈనెల 3న విడుదలై విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ ఫాదర్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తమ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా విడుదల చేసి, మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పలు విషయాలను షేర్ చేసుకున్నారు. 'కమల్‌గారు, దర్శకుడు లోకేష్, మరో వైపు విజరు సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి ప్రముఖుల కాంబినేషన్ ఉండటంతో మేం ఈ సినిమాని తీసుకున్నాం. నేటికి 80 కోట్ల గ్రాస్ వచ్చింది. ఎం.జి. బేస్‌మీద తీసుకున్నాం. కాబట్టి కొంత షేర్ కమల్ గారికి ఇవ్వాలి. ఆయన హ్యాపీ, మేమూ హ్యాపీ, ఎగ్జిబిటర్లు హ్యాపీ.ఈ సినిమాని 400 స్క్రీన్లలో వేశాం. థియేటర్లు పెరగలేదు. కానీ మల్టీప్లెక్స్ షోలు పెరిగాయి. మౌత్ టాక్‌తో మొదటిరోజు నుంచే కలెక్షన్లు బాగున్నాయి. కమల్‌గారు మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా బ్యానర్లో నితిన్‌తో చేేస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' 80 శాతం పూర్తయింది. మరోవైపు వక్కంతం వంశీ దర్శకత్వంలోని చిత్రం ఆగష్టులో స్టార్ట్ చేేయనున్నాం. ఇప్పటికే సాంగ్ చేశాం' అని సుధాకర్‌రెడ్డి చెప్పారు.