Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం ఈనెల 17న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. గతంలో సత్యదేవ్ - గోపి గణేష్ కాంబినేషన్లో 'బ్లఫ్ మాస్టర్' వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేసిన ఈ చిత్ర ట్రైలర్ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, 'సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న, అవినీతిమయం చేస్తోన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులపై సత్యదేవ్ గాడ్సేగా పోరాటం చేస్తాడు. సత్యదేవ్ ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నిద్రపోతున్న యువతను మేల్కొపే చిత్రమిది' అని తెలిపారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ,'ఈ సినిమా పూర్తయిన తర్వాత నాకు అనిపించిందేంటంటే, టి.కష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది. గోపీ గణేష్ చేసిన ఈ సినిమాతో ఆ లోటును తీర్చేసింది. సమాజానికి ఉపయోగపడే సినిమా చేయాలని నిర్మాతకు ఉంటుంది. 83 సినిమాలు తీసినా నా అన్ని సినిమాల్లోకి ఈ సినిమాపై చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గోపి గణేష్ సినిమా పిచ్చోడు. తనకు సత్యదేవ్ రూపంలో వజ్రం దొరికింది. ఈ సినిమా చూసిన తర్వాత మరో సినిమా చేస్తానని గోపికి చెక్ కూడా ఇచ్చాను' అని చెప్పారు. 'దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారు చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. మీ అందరినీ మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు' అని దర్శకుడు గోపి గణేష్ పట్టాభి అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, 'మనం సంధించే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఆలోచన పుట్టించిందంటే చాలు సత్య, నువ్వు ఈ సినిమా చేయగలవని.. భుజం తట్టి మరీ దర్శకుడు గోపీ నన్ను ప్రోత్సహించారు. యూత్ కోసం చేసిన సినిమా' అని తెలిపారు.