Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారథ్యంలో
ఓ సినిమా రూపొందుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 2గా నిర్మితమవుతున్న
ఈ చిత్రం గురువారం అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల
సమక్షంలో అంగరంగ
వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో నాగ చైతన్య హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్ట్ ఏ.సి.యస్ కిరణ్ అందించారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దర్శక, నిర్మాత బొమ్మ దేవర రామచంద్రరావు మాట్లాడుతూ, 'మంచి యూనిక్‌గా ఉన్న కథ లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేస్తాం. జులై ఫస్ట్ నుండి అరకులోను, మిగిలిన చిత్రీకరణను సెప్టెంబర్‌లో పూర్తి చేసి, అదే నెలలో విడుదల చేస్తాం. ఇందులో రాజు సుందరం అద్భుతమైన స్టెప్స్ అందిస్తున్నారు' అని చెప్పారు. 'చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. నా కల నెరవేరేలా చేసినందుకు మా నాన్నగారికి కృతజ్ఞతలు' అని హీరో తేజ్ అన్నారు.