Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా కారణంగా మూడు సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వరుసగా వచ్చేస్తున్నాయి. ఇక గ్యాప్ లేకుండా మేం కూడా సినిమాలను రిలీజ్ చేస్తాం' అని నిర్మాత బన్నీవాసు చెప్పారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా శనివారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, 'ప్రస్తుతం గోపీచంద్, మారుతి కాంబినేషన్లో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాం. దీన్ని జూలై 1న రిలీజ్ చేస్తున్నాం. ఇది 100% పక్కా ఎంటర్టైనర్. గోపి చంద్ గారు యాక్షన్ హీరో అయినప్పటికీ మారుతి ఈ సినిమాను నవ్వించడానికి తెరకెక్కించాడు. అలాగే సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా నిర్మించిన '18 పేజెస్'ను విడుదల చేస్తాం. దసరా సీజన్లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న 'వినరో భాగ్యము విష్ణు కథ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అలాగే ఆగస్టులో అల్లు శిరీష్ సినిమా కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ మూడు నాలుగు నెలల్లో మా గీతా ఆర్ట్స్ 2 నుంచి కంటిన్యూగా సినిమాలు వస్తూనే ఉంటాయి. మా బ్యానర్ నుంచి వచ్చేవన్నీ ఎంటర్టైనింగ్ సినిమాలు. వాటిని థియేటర్లో చూసినప్పుడే మజా వస్తుంది. ఇక టికెట్ల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను బట్టి రేట్లు పెంచుకునే వెసలు బాటు కల్పించింది. నేను ఎంత సంపాదించాను అని కాకుండా, ఆడియెన్స్‌ను థియేటర్‌కి ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే 'పక్కా కమర్షియల్' సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ పెట్టాం. 2002లో నేను ఇండిస్టీకి వచ్చాను. నిర్మాతగా 2011లో నా మొదటి సినిమా చేసాను. దాదాపుగా ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు. రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది (నవ్వుతూ). తదుపరి దర్శకులు చందు మొండేటి, పవన్ సాధినేనితో సినిమాలు చేయబోతున్నాం' అని తెలిపారు.