Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు బాలకష్ణ తన బర్త్ డే సందర్భంగా పేక్షకులకు, అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. శుక్రవారం బాలకష్ణ బర్త్ డే. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా చేయబోయే సినిమాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన నటించబోయే 108 చిత్రానికి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.
బాలయ్య 108వ సినిమాగా నటించబోయే ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య, అనిల్ రావిపూడి వంటి సరికొత్త కాంబినేషన్లో సినిమాని ఎనౌన్స్ చేయటంతో ఈ సినిమాపై ఇప్పటికే అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కథనంతో భారీగా తెరకెక్కనుంది. బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పర్ఫెక్ట్, మాస్ అప్పీలింగ్ స్క్రిప్ట్‌ని అనిల్ రావిపూడి రెడీ చేశారు. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎక్స్టార్డీనరీగా ఉండేలా కథ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రానిక సంబంధించి తారాగణం, సాంకేతిక విభాగం వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.