Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ధర్మయోగి', 'బూమారంగ్', 'లోకల్ బార్సు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత సి.హెచ్ సతీష్ కుమార్. ఆయన తన సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన తమిళ చిత్రం 'యానై'ను తెలుగులో 'ఏనుగు' పేరుతో విడుదల చేస్తున్నారు.
హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అరుణ్ విజరు, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ''సింగం' సిరీస్‌తో పోలీస్ అంటే ఇలా ఉంటాడా అని తెలుగు ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్‌ను పరిచయం చేసిన దర్శకుడు హరి. అయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సైతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ చిత్రానికి 'ఏనుగు' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో సముద్రఖని, కెజీఎఫ్ రామచంద్ర రాజు, రాధిక శరత్‌కుమార్ వంటి ఎంతో మంది సీనియర్ యాక్టర్స్‌తో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 12 న ఘనంగా జరపబోతున్నాం. అలాగే ఈ నెల 17న గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తున్నాం. మంచి కంటెంట్‌తో ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, డీఓపీ : గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ : మైఖేల్, ఎడిటర్ : ఆంథోని.