Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల17న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా
ఐశ్వర్య లక్ష్మీ నటించింది. సినిమా రిలీజ్ సందర్భంగా శనివారం
ఆమె మీడియాతో ముచ్చటించింది. 'తెలుగులో నా తొలి చిత్రం 'గాడ్సే'. మన వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం, అదెలా పని చేస్తుంది?, అందులో లోపాలేంటి? అనే విషయాలను ఇందులో చూపించాం. ధైర్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే కథాంశం.ఇందులో వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. నటిగా నన్ను నేను ఎలివేట్ చేసుకోవటానికి చాలా స్కోప్ ఉన్న రోల్ చేశాను. సమాజాన్ని ప్రశ్నించే 'గాడ్సే'గా ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తీశారు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ కానుంది. అలాగే తెలుగులో 'అమ్ము' అనే సినిమాలో నటించాను. ఆ సినిమా కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మలయాళం, తమిళంలోనూ పలు సినిమాలను చేస్తున్నాను' అని ఐశ్వర్య లక్ష్మీ అన్నారు.