Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి.ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'షికారు'. (యాన్ అన్లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శ్రీ సత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్.కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి కొలగాని దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన 'దేవదాసు పారు వల్ల బ్యాడు..' అనే సాంగ్‌ను చిత్ర బందం శనివారం ఫిలింఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ, 'నేను ఎంటర్టైన్మెంట్ను బలంగా నమ్మే వ్యక్తిని. ఓ సాంగ్ ద్వారా యూత్‌కు మెసేజ్ చెప్పాలనిపించింది. ఈనెల 24న సినిమా విడుదల కాబోతోంది. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. 'ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సమాజంలో జరుగుతున్న ఇష్యూను ఫన్‌గా తీశాం. అందుకే అన్లిమిటెడ్ ఫన్ రైడ్ అని పెట్టాం. ఏదైనా సినిమాలో ఒకటి, రెండు పాటలు బాగుంటాయి. కానీ మా సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి. 'మనసు దారి తప్పెనే..' సిద్ద్ శ్రీరామ్ పాడిన పాట పాపులర్ అయింది. 'ఫ్రెండ్షిప్'పౖౖె రాసిన రెండో పాట కూడా అంతే స్థాయిలో మంచి స్పందన దక్కించుకుంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన మూడో పాట కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి' అని చిత్ర నిర్మాత బాబ్జీ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత : సాయి పవన్ కుమార్.