Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'థ్యాంక్యూ'. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి 'మారో మారో..' అనే యూత్‌ఫుల్ కాలేజ్ లిరికల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం చిత్రబందం విడుదల చేసింది.
ఈ పాటకు వస్తున్న విశేష స్పందన గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, 'యూత్‌ఫుల్ మాస్ కాలేజ్ పాటగా వచ్చే ఈ సాంగ్‌కు తమన్ అత్యద్భుతమైన స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర అంతే అద్భుతంగా ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాటకు సర్వత్రా విశేష స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కి సైతం మంచి స్పందన వచ్చింది. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ సినిమా 'మారో మారో' పాటతో మరిన్ని అంచనాలనూ పెంచింది. లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించగా, నవీన్నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 8న వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో నిర్మాతలు విడుదల చేస్తున్నారు' అని చెప్పారు.