Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'సురాపానం'. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై, ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ,'చాలా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ సినిమా కొత్తగా ఉంది, ఎంటర్ టైనింగ్‌గా ఉంది అని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ వారం నుంచి థియేటర్స్ పెరుగుతున్నాయి. ఆడియెన్స్ కోరుకునే కొత్తదనం మా సినిమా ద్వారా ఇవ్వడం ద్వారానే విజయం దక్కింది. చిన్న చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్స్ దొరకవు. కానీ సినిమా బాగుంటే థియేటర్స్ క్రమంగా పెరుగుతాయి. మా చిత్రానికి కూడా ఇలాగే జరగడం సంతోషంగా ఉంది. మా టీమ్‌తో పాటు నిర్మాతకు ప్రత్యేకంగా కతజ్ఞతలు చెప్పాలి. ఆయన నమ్మకమే ఇవాళ మాకు దక్కిన విజయంగా భావిస్తున్నాం' అని చెప్పారు. 'ఈ సినిమా విజయోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు తెరకు కొత్త అమ్మాయిని అయినప్పటికీ టీమ్ అంతా సహకరించారు. సినిమా కోసం మేం పడిన కష్టమే ఈ విజయాన్ని అందించింది. మాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని హీరోయిన్ ప్రగ్యా నయన్ అన్నారు..