Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో పేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. విజరు సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రధారులుగా, స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్లో రూపొందిన ఈచిత్రం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ,''విక్రమ్' సినిమాని శ్రేష్ఠ్ మూవీస్‌కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నితిన్, సుధాకర్ రెడ్డి గారి వల్లే ఈ సినిమా ప్రేక్షకులకు భారీగా చేరువైంది. ఈ సినిమాని సుధాకర్ రెడ్డికి ఇస్తూ మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నా, జాగ్రత్త అని చెప్పా. సుధాకర్ రెడ్డి గారు ఆ బిడ్డని రికార్డ్ బ్రేకింగ్ చైల్డ్‌గా చేశారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా వెనుక నిర్మాత మహేంద్రన్ గారి కషి చాలా ఉంది. ఈ సినిమాకి వండర్ఫుల్ టెక్నిషియన్స్ పని చేశారు. ప్రేక్షకులు ఈ సినిమాని గొప్పగా ఆదరించారు. మళ్ళీ గొప్పగా తెలుగులో స్వాగతం పలికారు. 'మరో చరిత్ర' తర్వాత నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ విషయంలో నేను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతగా ఉంటాను. 'మరో చరిత్ర' సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్ళు ఆడింది. సినిమాకి భాష లేదు. సినిమాది ప్రపంచ భాష. విక్రమ్ విజయం మరోసారి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఎంజారు చేస్తున్నారు. రీపిటెడ్‌గా చూస్తున్నామని చెబుతున్నారు. ఈ సినిమాని బిగ్గెస్ట్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్' అని చెప్పారు.
'ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని మాకు తెలుసు. అయితే మేం ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందించారు ప్రేక్షకులు' అని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. హీరో రానా మాట్లాడుతూ, 'ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ చూశా. అద్భుతంగా ఉంది. కమల్‌గారిని చూసి సినిమా గురించి నేర్చుకున్నాం. దర్శకుడు లోకేష్ కమల్‌గారిని చాలా కూల్‌గా చూపించారు' అని చెప్పారు.
'విక్రమ్' బిగ్గెస్ట్ హిట్ అఫ్ ఇండియన్ సినిమా. అన్ని సినిమాలను క్రాస్ చేసి నెంబర్ వన్ స్థానంకు వెళ్తోంది. ఈ సినిమాకి అంత డెప్త్ ఉంది. కమల్ హసన్గారి కెరీర్లోనే ఇది హయ్యస్ట్ గ్రాస్ చేసిన చిత్రమిది.ఈ సినిమాని బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
- నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి