Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం దక్షిణకాశీగా పిలవబడే సిద్ధ రామేశ్వర ఆలయంలో సోమవారం తెల్లవారుజామున, మండలంలోని గుర్జకుంట గ్రామ సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వర్షాలు సమృద్ధిగా కురవాలని 101 బిందెల నీటితో ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షులు సాయిరెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహులు,రవీందర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,మహేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, భూపాల్ రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.