Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ విజరు, ప్రియా భవానీ శంకర్ జంటగా, హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఏనుగు'.
జూలై 1న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం ట్రైలర్ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా దర్శకుడు హరి మాట్లాడుతూ,'ఇది నా 16వ సినిమా. ఈ సినిమా కమర్షియల్, ఎమోషనల్ యాక్షన్ సినిమా. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలను వినోదాత్మకంగా చూపిస్తూ, ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు' అని చెప్పారు.
'నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. హరిగారితో వర్క్ చేయడం చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతాను. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి' అని హీరో అరుణ్ విజరు అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ,' తెలుగు ప్రేక్షకులు ఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే మంచి కంటెంట్‌తో ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఒక నిర్మాతగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా తమిళ 'యానై' సినిమాను తెలుగులో 'ఏనుగు' పేరుతో విడుదల చేస్తున్నాను ఏనుగు బలమెంతో ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు' అని తెలిపారు. నాయిక ప్రియాభవానీ శంకర్ మాట్లాడుతూ, 'అందరూ చూడాల్సిన సినిమా. దర్శకుడు హరిగారితో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా మంచి ఫలితం సాధిస్తుందని ఆశిస్తున్నా' అని చెప్పారు.