Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు మధ్య ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, 'నేను ఈ సినిమా చేయటానికి కారణం యూవీ క్రియేషన్స్ వంశీ. ఈ సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. రాశీఖన్నా ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ పెట్టారు. కాబట్టి మీరు, మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజారు చెయ్యండి. అల్లు అరవింద్, బన్నీ వాసు, మారుతితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.
'మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. ఒక మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమాని తీశాం' అని దర్శకుడు మారుతి అన్నారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ,'ఈ సినిమాను తీసింది మాస్ ప్రేక్షకుల కోసమే. ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేస్తున్నాం' అని అన్నారు. నాయిక రాశిఖన్నా మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు కమెడియన్ని (నవ్వుతూ). మారుతీ చాలా మంచి కథ రాశారు' అని తెలిపారు.