Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో లక్ష్ తాజాగా నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్స్టర్ గంగరాజు'. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెల 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ చాలా గ్రాండ్గా నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఇషాన్ సూర్య మాట్లాడుతూ, 'నేను దర్శకుడిగా ఇలా ఉండటానికి కారణం హీరో లక్ష్. ఒక మంచి సినిమాతో వస్తున్నందుకు గర్వంగా ఉంది. అందరు ప్రేమతో పనిచేశారు. అందుకే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చింది' అని తెలిపారు.
'మా బ్యానర్లో రామారావుగారు, నాగేశ్వరరావు వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాము. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. దాదాపు పదిహేను సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. వీటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. దర్శకుడు ఈ సినిమాను ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. తమిళంలో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ అవుతుంది' అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ,'జయసుధ గారి అబ్బాయి నిహార్ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నటి సత్య కష్ణ గారి కూతురు కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఎంతో మంది కొత్తవాళ్లు ఈ సినిమాలో నటించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ఇషాన్ సూర్య మంచి టాలెంటెడ్. ఈ సినిమాను ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్ వేదికతో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరు ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 'తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా, వెరైటీగా ఉంటుంది' అని హీరోయిన్ వేదిక దత్త చెప్పారు.