Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. శ్రీధర్ గాదే దర్శకుడు. సంజన ఆనంద్ నాయికగా నటిస్తోంది.
కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా దీన్ని కోడి రామకష్ణ తనయ కోడి దివ్య దీప్తి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏకధాటిగా జరుగుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ''రాజావారి రాణిగారు', 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి విజయవంతమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రంలో ఆయన చాలా కమర్షియల్‌గా కనిపించనున్నారు. ఆయన కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో లహరి ద్వారా మార్కెట్లోకి రిలీజ్ కానుంది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా అందర్ని కచ్చితంగా అలరిస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేస్తాం' అని తెలిపారు.