Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ,'నా స్నేహితుడు జీవన్ రెడ్డి చెప్పిన కథ నచ్చటంతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని నిర్మించాను. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి' అని అన్నారు.
'నిర్మాత, నా ఫ్రెండ్ రాజు ఒక కలర్ పుల్ సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవాడు. ఆయన అన్నట్లుగానే మంచి కమర్షియల్, కలర్‌ఫుల్ సినిమా చేశాం. ఒక యువ హీరో ఈ కథకు కావాలనుకున్నప్పుడు ఆకాష్ నా మనసులో మెదిలారు. బచ్చన్ సాబ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు' అని దర్శకుడు జీవన్ రెడ్డి చెప్పారు. హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ, 'సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడు థియేటర్లో ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎదురుచూస్తున్నాం. తొలి పాట నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ వరకు ఆదరణ చూపించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. మేం చేస్తున్న ప్రయత్నానికి యూవీ క్రియేషన్స్ కలవడం మా సినిమా స్థాయిని పెంచేసింది. వంశీ, ప్రమోద్ గారికి థ్యాంక్స్' అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ : అన్వర్ అలీ, ఆర్ట్ : గాంధీ నడికుడికర్, ఆడియో : లహరి, సహ నిర్మాత : అల్లూరి సురేష్ వర్మ.