Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'గాడ్సే'.
ఐశ్వర్య లక్ష్మీ నాయికగా సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'పవన్‌కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా. కానీ ఆయనకు నెరేట్ చేయలేదు. అయితే ఆయన తప్పకుండా మా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. నేనెక్కువ టి.కృష్ణగారి సినిమాలు చూసేవాడిని. అలాగే మణిరత్నంగారి సినిమాల ప్రభావమూ నాపై ఉంది. ఈ కథని తయారు చేసుకున్నప్పుడు లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణన్‌తో చర్చించాను. ఆయన సూచనలు కూడా తీసుకున్నాను. ఇందులో 'గాడ్సే'గా సత్యదేవ్ అద్భుతంగా నటించారు. కథలో భాగంగా ఆయన ఇంటర్ చదువుతున్నప్పుడు స్టేజ్ మీద ఓ నాటకం జరుగుతుంటుంది. అందులో ఆయన నాధూరామ్ గాడ్సేగా నటించాడు. చివర్లో బొమ్మ తుపాకీతో గాంధీగారిని కాల్చాలి. కానీ సత్యదేవ్ కాల్చకుండా నిరాకరిస్తాడు. అంత సున్నితమైన వ్యక్తి.. 'గాడ్సే'గా మారి ఎందుకు గన్ పట్టుకోవాల్సి వచ్చిందనేదే ఈ సినిమా సమాజాన్ని ప్రశ్నలతో సంధించే 'గాడ్సే' అందర్నీ ఆలోచింపజేస్తాడు. మన దేశంలో 93 శాతం మంది తమ విద్యా అర్హతలకు తగిన ఉద్యోగం చేయటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందనే విషయాన్ని మా చిత్రంలో చూపించాం. ఇందులో శక్తివంతమైన మహిళా పాత్రలో నాయిక ఐశ్వర్య లక్ష్మీ కనిపిస్తారు. నిర్మాత కళ్యాణ్‌గారు రాజీపడకుండా నిర్మించారు' అని అన్నారు.