Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విడుదలైన మూడో వారంలో కూడా మా 'ఎఫ్3'ని చూసి షేర్ రూపంలో కాసుల వర్షం కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా 'ఎఫ్3' సిసలైన విజయానికి ఇదే నిదర్శనం' అని నిర్మాత దిల్ రాజు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'ఎఫ్ 3'. హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్ర ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుకలో ఆయన చేతుల మీదగా యూనిట్‌కు మెమొంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'దిల్ రాజు, శిరీష్ కథలు ఎంపిక చేయడంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్త ఆలోచనతో చేసిన ఈ సినిమా వినోదంతో పాటు గొప్ప సందేశాన్ని కూడా పంచింది' అని తెలిపారు.
'సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడం, నిర్మాతలకు డబ్బులు రావడం, డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారనే ఆలోచన ప్రతి నటుడికి ఆనందాన్ని ఇస్తుంది' అని వరుణ్ తేజ్ అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ,'వారం గడిస్తే సినిమా ఉంటుందా లేదా అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మా సినిమా మూడోవారం కూడా షేర్ రాబడుతూ, కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతోంది' అని చెప్పారు.