Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజరు మైసూర్ సమర్పకులు.
ఈ చిత్రంతో ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా శ్రీరామ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'నిర్మాత అచ్యుత రామారావు గారు ఈ కథ చెప్పారు. ఆయనే కథ రాశారని తెలిసి ఆశర్యర్యపోయా. కథ విన్న వెంటనే 'మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా?' అని అడిగితే, తమ బ్యాచ్‌లో జరిగిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన టెన్త్ బ్యాచ్ రీ యూనియన్ తర్వాత జరిగిన సంఘటనలే ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్'. అయితే ఇందులో కొంత ఫిక్షన్ కూడా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్లు ఎవరో ఒకరు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్ మెమొరబుల్ మూమెంట్స్. అటువంటి మూమెంట్స్‌ను పిక్చరైజ్ చేశాం. చాందిని పాత్రలో అవికా గోర్ నటించారు. చాందిని కోసం అన్వేషించడమే సినిమా. ఎప్పుడు కలుస్తామో మీరు ఊహించుకోవచ్చు (నవ్వుతూ). సినిమాటోగ్రాఫర్ అంజితో తమిళంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అప్పుడు నా డేట్స్ కుదరక చేయలేదు. అయితే ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా చేయటం హ్యాపీగా ఉంది. ఆయన ఈ సినిమాని అత్యద్భుతంగా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఆయనతోనే మరో సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే నా కోసం సినిమాటోగ్రాఫర్ రసూల్ కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.