Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతాని రామకృష్ణణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై షేర్ దర్శకత్వంలో, మిన్ని నిర్మించిన చిత్రం 'యు ఆర్ మై హీరో'. ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకష్ణ, అనంత్ నటించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో సినీ అతిరథుల సమక్షంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,'సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వబోతున్న సినిమా ఇది. రామకష్ణ గౌడ్, దర్శకుడు షేర్ కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి సినిమాలను నిర్మించడం అభినందనీయం' అని చెప్పారు.
'షేర్ మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు. తను ఇప్పటి వరకు 10 సినిమాలు చేశాడు. వాటిని నేనే రిలీజ్ చేశాను. ఈ సినిమాలో చాలామంది తెలంగాణ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాడు. అలాగే ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇస్తూ చక్కటి సినిమా తీశాడు. ట్రైలర్, ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్‌గా దర్శకుడు షేర్ దీన్ని తెరకెక్కించాడు' అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకష్ణ గౌడ్ తెలిపారు. చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ, 'హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు.
'మిలింద్ గునాజీ ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నటీనటులు చాలా బాగా నటించారు. నా గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఇందులో ఉన్న మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతాని రామకష్ణ గౌడ్, నిర్మాత మిన్ని సర్ సపోర్ట్‌తో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 17న వస్తున్న ఈ సినిమాని ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా మంచి కంటెంట్‌తో తీశాం. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని దర్శకుడు షేర్ తెలిపారు. హీరో ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ, 'ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ సినిమా లోని పాటలు చాలా బాగా వచ్చాయి' అని తెలిపారు.