Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'అహాం రీబూట్'. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేేశారు. కాన్సెప్ట్ ఎంతో బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని అడివి శేష్ టీమ్‌ని అభినందించారు.
'మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి..' అని రేడియో సష్టికర్త మార్కొనిచెప్పిన కొటేషన్‌తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జే నిలరు పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలరుకు ఫోన్ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు రేడియో ద్వారా కథానాయకుడి సాయాన్ని కోరుతుంటారు. మరి వాళ్లను ఆయన ఎలా కాపాడాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా ప్రజెంట్ చేయడమే ఈ సినిమాకి బలం చేకూరింది. హీరో సుమంత్ నటన ప్రత్యేకంగా ఉండ బోతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.