Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన నూతన సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా హీరోల్లో ఒకరైన రోహన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'మాది గుంటూరు. నాన్నగారు పైలట్. దీంతో చిన్నతనం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగా. మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్‌లో బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ చేశా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఫ్రాన్స్‌లో థియేటర్ చేశా. యూరోప్ ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక షో రీల్ చేశాను. ఆ షో రీల్ సునీల్ గారికి బాగా నచ్చి, ఎంఎస్ రాజుగారికి చూపించారు. ఆయన ఈ సినిమా కోసం కొత్తవాళ్లను తీసుకుందామనే ఆలోచనలో ఉండటంతో నన్ను ఒక హీరోగా ఎంపిక చేశారు. ఎంఎస్ రాజుగారి సినిమా కావడంతో ఎగిరి గంతేశా. ఇందులో నా పాత్ర పేరు మంగళం. ఎటువంటి భయాలు లేకుండా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఈ పని చేస్తే ఏమవుతుందనేది ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్‌తో కలిసి మంగళం బ్యాచ్‌లర్ ట్రిప్‌కి వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగిందనేది కథ. నాకు జోడీగా కతికా శెట్టి నటించారు. యువతను ఆకట్టుకునే సినిమా అని ట్రైలర్లు చూస్తే తెలుస్తుంది. అలాగే సందేశం ఇచ్చే సన్నివేశాలూ ఉన్నాయి' అని చెప్పారు.