Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. ఈనెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం వర్మ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఒక రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు. ఎన్నికల సమయంలో సురేఖ గారి ఇంటర్వ్యూలు చూశా. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడి కొంత సమాచారం తీసుకున్నా. కొండా దంపతుల జీవితంలో ట్విస్టులు ఉన్నాయి. డ్రామా ఉంది. కథ తయారు చేసి కొండా ఫ్యామిలీకి నెరేట్ చేశా. వారికి నచ్చింది. 'మీకు అభ్యంతరం లేకపోతే ప్రొడ్యూస్ చేస్తా' అని సుష్మితా అడిగారు. కొండా మురళి జీవితంలో నాకు బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. త్రిగుణ్‌లో ఆయన క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది. కొండా మురళి, సురేఖ కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం (1990 నుంచి 2000) వరకూ ఉంటుంది. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేటివ్ ఎలిమెంట్‌గా వాడాను. అలాగే గద్దర్ గారితో కలిసి ఈ సినిమాలో పాట పాడాను. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ గారితో సినిమా ప్లాన్ చేస్తున్నా. అది హర్రర్ జోనర్లో ఉంటుంది. నవంబర్‌లో స్టార్ట్ కావచ్చు' అని తెలిపారు.