Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరికొత్త కంటెంట్ కథలతో ప్రేక్షకుల్ని అలరించడంలో జీ5 తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్ మెంట్ని అందించేందుకు తెలుగులో ఏకంగా 11 ఒరిజినల్స్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేయనుంది. స్టార్-స్టడెడ్ ఈవెంట్ 'హుక్డ్' పేరుతో నిర్వహించిన వేడుకలో హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి సినీ ప్రముఖులతో ఈ 11 ఒరిజినల్ సిరీస్‌లను జీ5 గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకష్ణ, రాజేశ్వరి నాయర్, ఆడుకలం నరేన్, శరణ్య ప్రదీప్, సమ్మెట గాంధీ, ఈస్టర్ నొరోన్హా నటించిన మల్టీస్టారర్ థ్రిల్లర్ అయిన 'రెక్కీ', సుశాంత్ నటించిన 'మా నీళ్ల ట్యాంక్' 'ఏటీమ్', 'ఆహా నా పెళ్లంట', 'హలో వరల్డ్' ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న 'మిషన్ తషాఫీ'- గూఢచారి డ్రామా, పరువు, బహిష్కరణ, ది బ్లాక్ కోట్, ప్రేమ విమానం, హంటింగ్ ఆఫ్ ది స్టార్స్ వంటి ఇతర షోలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ సందర్భంగా అనురాధ గూడూరు, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ, 'జీ5 తెలుగు మార్కెట్లో చాలా బలమైన, గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. విస్తతమైన ప్రేక్షకులు ఉన్నారు. తాజా కంటెంట్ స్లేట్‌లో భాగంగా 11 కొత్త ఒరిజినల్ కథలు, ఐకానిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇది జీ5 ప్రత్యేకత. భాషతో నిమిత్తం లేకుండా నాణ్యమైన కంటెంట్‌తో రూపొందిన వెబ్ సిరీస్‌లు, షోలు, సినిమాలతో ఎప్పటికప్పుడు మేం వీక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాం. లేటెస్ట్గా 'కార్తికేయ-2', 'హను-మాన్' వంటి చిత్రాలను కూడా జీ 5 కొనుగోలు చేసింది' అని అన్నారు.