Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'చోర్ బజార్'. ఈ చిత్రంలోని 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్‌ను అగ్ర కథానాయకుడు రిలీజ్ చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే. తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. ఓ వైపు పూరీ ఫ్యామిలీతో తనకి ఉన్న అనుబంధం, మరో వైపు తన ఫేవరేట్ స్టార్ పేరు మీద చేసిన పాట కావడంతో 'చోర్ బజార్' టీమ్‌కి సపోర్ట్ చేస్తూ ఈ పాటను విడుదల చేయటం విశేషం. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' బాగుందని, ఈ సినిమా హిట్ అవ్వాలని ఆయన విషెస్ తెలిపారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' పాటను మదీన్ ఎస్కే స్వర కల్పనలో, మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు. ''షోల'ే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలోగానే వెళ్లిపోయా ఎక్స్ రోడ్డుకి. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చే సీను. ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాను. నన్నే చూస్తు ప్లే చేస్తుంటే ఫ్లాట్ అయ్యాను...అంటూ సాగే ఈ పాట అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ నాయికగా నటించింది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. దీంతోపాటు యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పకులుగా వ్యవహరించడం ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ప్రభుదేవా, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ.