Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ తాజా షెడ్యూల్లో చిరంజీవి, శతిహాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌తోపాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ మెగా154 సెట్స్‌ని సందర్శించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. సుకుమార్‌కి దర్శకుడు బాబీ లాప్టాప్లో ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలను చూపిస్తున్న ఫొటోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయటంతో, సుకుమార్ సడన్ విజిట్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
మెగా154 వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ చిత్రం బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఆయన తీర్చిదిద్దుతున్నారు. చిరంజీవితో శతి హాసన్ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్‌కి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మెగా 154కి కూడా సంగీతం అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కష్ణ, వినీత్ పొట్లూరి, సిఈవో: చెర్రీ, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి.