Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్శకుడు శివ నిర్వాణ
రంజిత్, సౌమ్య మీనన్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'లెహరాయి'. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'ధర్మపురి' ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఘంటాడి కష్ణ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'గుప్పెడంత..' సాంగ్‌కి ఆర్గానిక్‌గా మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ సాంగ్‌ని వందల్లో రీల్స్ చేయడంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ పాట సక్సెస్‌కి కొనసాగింపుగా ఈ చిత్రం కోసం ప్రముఖ సింగర్ సిద్ద్ శ్రీరామ్ ఆలపించిన రెండవ సాంగ్ 'మెరుపై మెరిసావే..వరమై కలిసావే..గుండే గిల్లి వెళ్ళావే..'ను దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలోని రెండవ సాంగ్‌ని విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. సిద్ధ్ శ్రీరామ్ సాంగ్ పాడితే చాలు చార్ట్‌బస్టర్‌లో నెంబర్ వన్ పోజిషన్లో ఉంటుంది. ఈ సాంగ్ కూడా తప్పకుండా నెంబర్ వన్ పొజిషన్‌కి వెళ్తుంది. మ్యూజిక్ డైరక్టర్ జికే గారు అందించిన చాలా పాటలు అప్పట్టో యూత్ అంతా పాడుకునేవారు. యూత్‌ని ఆకర్షించే ట్యూన్స్ ఇవ్వడంలో ఆయనకి ఆయనే సాటి. మళ్ళీ ఈ చిత్రం ద్వారా కమ్ బ్యాక్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. క్యాచి లిరిక్స్‌తో హమ్మింగ్ ట్యూన్‌తో ఈ పాట చాలా బాగుంది' అని తెలిపారు.
'మొదటి సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండవ సాంగ్ కూడా ఆకట్టుకొవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్‌ని జికే గారు ఆయన సాంగ్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా కంపోజ్ చేశారు. సిధ్ద్ శ్రీరామ్ గారు ఈ పాటని పాడటమే ఈ పాటకి మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాను. మా చిత్రంలోని మొదటి పాట విడుదల తరువాత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సిరి వేంకటేశ్వర సినిమాస్ అధినేత రవికుమార్ రెడ్డి పోతం వారు ఫ్యాన్సీ రేట్‌కి సినిమాని కొనుగొలు చేశారు' అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దర్శకుడు రామకష్ణ పరమహంస మాట్లాడుతూ, 'జికేగారి మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. సిధ్ధ్ శ్రీరామ్ గారు పాడిన ఈ పాటని ప్రతిఒక్కరూ తమ మొబైల్లో రిపీట్‌గా వింటారు. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. ప్రతి సాంగ్ అలరించే విధంగా ఉంటుంది' అని చెప్పారు.