Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' దీని సెకండ్ సీజన్ స్ట్రీమింగ్కి రంగం సిద్ధమైంది.
ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.
ఎల్.కష్ణ విజరు, అరిగెల విశ్వనాథ్ సంయుక్త దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'గతేడాది స్ట్రీమింగ్ అయిన 'పరంపర'కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 21 నుంచి ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంగా 'పరంపర' రూపొందింది. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ సైతం అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది. 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ పై ఇప్పటికే వెబ్ సిరీస్ లవర్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొంది' అని మేకర్స్ చెప్పారు.