Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం 'చోర్ బజార్'. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా శనివారం నిర్మాత వీఎస్ రాజు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'మాది భీమవరం. సినిమా మీద ఇష్టంతో ఇండిస్టీకి వచ్చాను. రామ్ గోపాల్ వర్మ 'రక్ష' చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. అక్కడే నాకు జీవన్ రెడ్డి పరిచయం. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 'గుండెల్లో గోదారి', 'జోరు..' ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. జీవన్ రెడ్డి చెప్పిన ఈ 'చోర్ బజార్' కథ నాకెంతో బాగా నచ్చింది. 'చోర్ బజార్' అనేది హైదరాబాద్‌లో 400 ఏళ్లుగా ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ అలాగే అమ్ముతుంటారు. ప్రతి గురువారం అక్కడ ఈ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరొస్తుంది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఆ పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ చేశాం. సీనియర్ నటి అర్చన గారు మదర్ పాత్రలో నటించారు. 25 ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. స్టంట్ మాస్టర్ ఫైట్స్‌ని బాగా డిజైన్ చేశాడు. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. 'జడ పాట..' పెద్ద హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో మా సినిమా పాటలు వైరల్ అయ్యాయి. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ కలవడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. వాళ్లకు సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నారు' అని వీఎస్రాజు చెప్పారు.