Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఐక్యూ'.
కాయగూరల లక్ష్మీపతి సమర్పణలో శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి, కాయగూరల శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత కె.యస్. రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఇదొక మంచి యూనిక్ సబ్జెక్ట్. యూత్‌కు సంబంధించిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోయిన్ చాలా ఇంటెలిజెంట్‌గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు. సంగీత దర్శకుడు ఘటికాచలం అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు' అని చెప్పారు. 'తమ్ముడు శ్రీనివాస్ తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి' అని నిర్మాత కాయగూరల లక్ష్మీపతి అన్నారు.