Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'పెళ్లికూతురు పార్టీ'. ఎ.వి.ఆర్.స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు. దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, 'సినిమా రిలీజ్ విషయంలో పి.వి.ఆర్. సినిమాస్ బాగా సపోర్ట్ చేశారు. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది. అన్నపూర్ణమ్మగారు ప్రధాన పాత్ర పోషించారు. ఫన్ అడ్వంచర్ రైడ్ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా' అని చెప్పారు.
'మా ట్రైలర్ బాగా నచ్చి పి.వి.ఆర్. సినిమాస్తోపాటు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ వారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఇది మా సినిమాకు మంచి శుభపరిణామం. దర్శకురాలు అపర్ణ మంచి ఎచీవ్మెంట్తో సినిమా తీశారు. నటీనటులు బాగా నటించారు. ఈనెల 24న రిలీజ్ అవుతున్న మా సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది' అని నిర్మాత ఎ.వి.ఆర్.స్వామి అన్నారు.