Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. ఇందులో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ ఒక హీరో. నిర్మాతల్లో కూడా ఆయన ఒకరు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్.ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ వారు చిత్ర
నిర్మాణంలో భాగస్వాములు. ఈనెల 24న సినిమా విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌తో మీడియాతో మాట్లాడుతూ,'నేను నటించిన తొలి చిత్రం 'తూనీగ తూనీగ' విడుదలై జూలై 20కి పదేళ్లు. అలాగే, నా 30వ పుట్టినరోజు కూడా. నా కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే, ఇందులో డిఫరెంట్ రోల్ చేశా. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇందులో నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాను. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాను. ఎక్కువ స్మోక్ చేస్తాను. బాగా బరువు పెరుగుతాను. నా పాత్ర ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే ఈ సినిమా. అలాగే ఇందులో రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. మెహర్ చాలా బాగా చేసింది. ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. ఇదొక సింపుల్ ఫిల్మ్. ప్రేక్షకులు హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యే సినిమా. ఫాదర్స్ డే సందర్భంగా మా ఫాదర్‌కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను. అయితే, ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమా కాపీ చూపించారు. సినిమా చాలా బావుంది. నేను చాలా హ్యాపీ. మా నాన్నగారి గురించి చెప్పాలంటే, మరో జన్మంటూ ఉంటే, దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే 'మళ్ళీ ఎంఎస్ రాజుగారి అబ్బాయిలా పుట్టాలి' అని కోరుకుంటా' అని చెప్పారు.