Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'తీస్ మార్ ఖాన్'. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకుడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుండగా, సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్గా మేకర్స్ టీజర్‌ని రిలీజ్ చేశారు.
'ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తోంది. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని మేకర్స్ దీమాగా ఉన్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.