Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న యువ కథానాయకుడు విశ్వక్ సేన్. తాజాగా మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కి అర్జున్ రచయిత, నిర్మాత, దర్శకుడుగా వ్యవహరించటం విశేషం. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రొడక్షన్ నెం 15గా నిర్మిస్తున్నారు. ఇందులో అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్‌ని తెలుగులో కథానాయికగా పరిచయం మరో విశేషం. ఇప్పటికే కన్నడలో తన ప్రతిభ చాటుకున్న ఐశ్వర్య అర్జున్ ఈ ప్రాజెక్ట్‌తో తెలుగులోకి రావడం పర్ఫెక్ట్ ఎంట్రీ కానుంది. సీనియర్ నటుడు జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదొక రోడ్ ట్రిప్ చిత్రం. విశ్వక్ సేన్‌ను విలక్షణమైన పాత్రలో అర్జున్ చూపించనున్నారు. ప్రొడక్షన్ పనులు ప్రారంభించడంతో చిత్ర యూనిట్ సినిమా ప్రయాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ఎనౌన్స్ చేయనున్నారు.