Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. ఈనెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయకుడు త్రిగుణ్ సోమవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. 'కొండా'లాంటి సినిమా ఆయనతో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 'రక్త చరిత్ర', 'వంగవీటి' బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. 'కొండా' అనేది బయో ఫిక్షన్. ఇందులో రెండు పిల్లర్స్ ఉన్నాయి. కొండా మురళి గారు, సురేఖమ్మ గారు. ఉద్యమంలో ప్రేమకథ పుట్టింది. అదొక కమర్షియల్ పాయింట్. ఈ తరహా సినిమాల్లో ప్రేమకథ పెడితే సహజంగా ఉండదు. కానీ, ఈ సినిమాలో అదొక నేచురల్ పాయింట్. నక్సలైట్ నుంచి రాజకీయ నేత వరకూ కొండా మురళి ప్రయాణం చాలా భిన్నమైనది. సమాజంలో మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని చేధించుకుని కొండా మురళి ఎదిగారు. ఇండిస్టీలో నాకు ఎదురైన పరిస్థితులు, జీవితంలో మురళి గారికి ఎదురైన పరిస్థితులు ఒక్కటే. నేను నా పరిమితులను దాటుకుని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే మురళిగారి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎమోషన్స్ పరంగా సినిమా పీక్స్‌లో ఉంటుంది. ఒక సన్నివేశంలో 47 బుల్లెట్స్ ఫైర్ అవుతాయి. ఇటువంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. 'ఎలా ఆడుతుందో నాకు తెలియదు. కానీ, క్రాఫ్ట్స్ పరంగా ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో 'కొండా' ఒకటి' అని వర్మ గారు చెప్పారు. ఈ బయోపిక్ చేసిన తర్వాత నా పేరు మాత్రమే కాదు జీవితమే మారింది' అని అని త్రిగుణ్ తెలిపారు.
ఈ సినిమా తర్వాత 'ప్రేమ దేశం' విడుదల అవుతుంది. అందులో నేను, మేఘా ఆకాష్ జంటగా నటించాం. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అని మరో సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యింది. దేవ కట్టా గారి శిష్యుడు సురేష్ దర్శకత్వంలో, మిస్కిన్ గారి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాను. అలాగే రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ వారు పర్పుల్ రాక్ అని బ్యానర్ పెట్టారు. అందులో 'లైన్‌మేన్' అని సినిమా చేస్తున్నా. 'కిరాయి' సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.