Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్.ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మించారు.
వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగ స్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కతికా శెట్టి హీరోయిన్లు. ఈ సినిమా ఈనెల 24న విడుదల అవుతోంది. సోమవారం కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ''యూత్‌ఫుల్ ట్రైలర్. చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. '7 డేస్ 6 నైట్స్' అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ఓటీటీలో 'డర్టీ హరి'లో పెద్ద హిట్. ఈ '7 డేస్ 6 నైట్స్'ను యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ రేట్స్ పెడుతున్నాం. డీసెంట్ ఫిల్మ్ ఇది. అందరూ చూడొచ్చు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్. సుమంత్ అశ్విన్ నటించిన సినిమాల్లో నాకు నచ్చిన చిత్రమిది. డీ గ్లామర్ రోల్ చేశాడు. తనతో పాటు రోహన్ లైవ్లీగా చేశారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని చెప్పారు.