Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వ్యక్తి ఆలోచన, దాని ప్రభావం మరో వ్యక్తి పై ఎలా చూపుతుంది అనే కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'ప్రీ ప్లాన్డ్'. జి.వి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై యోగి కటిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, జి.వెంకట రాజేష్, శ్రీపతి నాయుడు నిర్మించిన చిత్రమిది. రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న గ్రాండ్‌గా విడుదలవుతుంది.
తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రచయిత త్యాగరాజు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ సిఇఓ రాజీవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ మాట్లాడుతూ,'దర్శకుడు యోగి కొత్త వాడైనా సినిమాని చాలా బాగా తీశాడు. మేం అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సిఇఓ రాజీవ్ గారికి థ్యాంక్స్' అని చెప్పారు. 'ఈ సినిమాకి లీలు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మందర్ సావంత్ డి. ఓ. పి, సంపత్ కుమార్ ఇలపురం ఎడిటింగ్.. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది' అని దర్శకుడు యోగి చెప్పారు.