Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వానవిల్లు' చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన చిత్రం 'సదా నన్ను నడిపే'. వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డిఆర్.శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి హీరో, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం వంటి బాధ్యతలను నిర్వహించిన ప్రేమ్ కరణ్ మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'దర్శకుడు అవ్వాలన్నది నా ఎయిమ్. అనుకోని పరిస్థితిల్లో నేనే హీరోగా మారిపోయాను. దానితోపాటు నేపథ్య సంగీతం కూడా నేనే చేశాను. మా సినిమా ఈనెల 24న థియేటర్‌కు రావడం అదష్టంగా భావిస్తున్నాను. కథగా చెప్పాలంటే ఇదొక ఎమోషనల్ లవ్‌స్టోరీ. 'కలిసుందాంరా', 'గీతాంజలి' తరహాలో మంచి ఫీల్ కనిపిస్తుంది. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నాడని తెలిశాక, వారితో ఉన్న కొద్ది క్షణాలు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామనేది ఇందులో చూపించాం. ఇందులో ఎమోషన్‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఇది ఓ వాస్తవ కథ. కర్నాటకలో జరిగింది. చిన్న అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చాను. ఒకవేళ ఆ సంఘటన ఇలా జరిగివుంటే ఎలా వుంటుందనేది ఆసక్తిగా చెప్పాను. నా మొదటి సినిమా 'వానవిల్లు' బాగుందనే పేరు వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతో అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ సినిమా చేశాను. సెన్సార్ సభ్యులు కూడా బెస్ట్ ఎమోషన్ ఫిలిం అని కితాబిచ్చారు. చివరి 25 నిముషాలు బాగా ఇన్వాల్వ్ చేశారని ప్రశంసించారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత మరో సినిమాకి కథ రెడీగా ఉంది. దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను' అని ప్రతీక్ ప్రేమ్ కరణ్ చెప్పారు.