Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా, మరొక అగ్ర కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మరో పాటకు కొరియోగ్రఫీ అందించారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కాంబినేషన్లో తెరకెక్కిన పార్టీ సాంగ్‌కి గణేష్ ఆచార్య స్టెప్స్ సమకూర్చారు. ఎంగేజ్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ప్రభుదేవా, గణేష్ ఆచార్యతో పాటు ఈ సినిమా కోసం డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా లీడ్ పెయిర్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ప్రముఖ డాన్స్ మాస్టర్లు కొరియోగ్రఫీ సమకూర్చడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : చోటా.కె.నాయుడు, డైలాగ్స్: భాను, నందు సంగీతం : అనూప్ రూబెన్స్, మూల కథ : జి.నాగేశ్వరరెడ్డి.