Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రణవి పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఎమ్‌వి ఐకాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో అనిత, ప్రఖ్యాత్ సమర్పిస్తున్న చిత్రం 'లాట్స్ ఆఫ్ లవ్'. ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లు రామకష్ణ, దర్శకుడు వీరశంకర్, జెడి మోహన్ గౌడ్, ప్రసన్నకుమార్, ప్రతాని రామకష్ణ గౌడ్, శ్రీరంగం సతీష్ ఒక్కొక్కరు ఒక్కో గీతాన్ని విడుదల చేశారు.
చిత్ర టీజర్‌ను నటి అనిత షిండే, ట్రైలర్‌ను మిస్ ఊటీ అనన్య అగర్వాల్ రిలీజ్ చేేశారు. టిప్స్ తెలుగు మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డా. బికె కిరణ్ కుమార్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో నేను కూడా నటించాను. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించటమే కాకుండా అంతే అద్భుతంగా దర్శకుడు, నిర్మాత విశ్వానంద్ తెరకెక్కించారు' అని తెలిపారు.
'మనం పుట్టినప్పటి నుంచి మనచుట్టూ ఎంతో లవ్‌ను చూస్తూ ఉంటాం. అలా విభిన్నమైన 4 జంటల మధ్య ఉండే, జరిగే ప్రేమ కథాంశమే ఈ సినిమా. పాటల విషయానికి వస్తే, నేనే మ్యూజిక్ కంపోజ్ చేశాను. విన్న వారందరూ బాగున్నాయి అంటున్నారు. ఇందులో ఉన్న 5 పాటలు కూడా విభిన్నమైన లవ్ థీమ్స్‌ను కలిగిఉంటాయి. వచ్చే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.