Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతిశయోక్తులు, పగలు ప్రతీకారాలు వంటివి లేకుండా నిజానికి దగ్గరగా సరికొత్త లోకంలో తీసుకెళ్ళి, అందరినీ మెప్పించేలా 'గంధర్వ' చిత్రం తీశానని అంటున్నారు దర్శకుడు దర్శకుడు అప్సర్.
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై యఎస్.కె.ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుభాని నిర్మించారు. జూలై1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అప్సర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇజ్రాయిల్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా యాంటీ ఏజ్ (వయస్సు ఎక్కువైనా యంగ్‌గా వుండేలా) పై కథ రాయాలనిపించింది. యాంటీ ఏజ్ ఉన్న వ్యక్తికి తన కుటుంబంతో లింక్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి 'గంధర్వ' కథ పుట్టింది. మిలట్రీ నేపథ్యంలో సాగే ఈ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ట్రాక్స్, సైన్స్ గురించి ఆలోచించేవారు, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు మెచ్చేవారికి ఈ సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది. 'వంగవీటి', 'జార్జిరెడ్డి' చిత్రాలతో సందీప్ మాధవ్ ఎంత మంచి పేరు వచ్చిందో, ఈ సినిమాకీ కూడా అంతే వస్తుంది. ఇందులో హాలీవుడ్‌కి సంబంధించిన సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్ లాంటి సీన్ ఒకటి ఇందులో ఉంది. పండగ చేసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఓ పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా త్వరలోనే ప్రారంభమవుతుంది' అని అన్నారు.