Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కరణ్ అర్జున్'. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ నెల 24న 186 థియేటర్స్‌లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఫిల్మ్ ఛాంబర్లో మేకర్స్ ప్రీి రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ. 'మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకుని, సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టు మలిచి తీసిన సినిమా ఇది. మంచి లొకేషన్స్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో కూడా చిత్రీకరణ చేశాం. ఎవరూ ఊహించని విధంగా ప్రతీ సీన్ ఉంటుంది. మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అని అన్నారు.
'సినిమా బాగా వచ్చింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న విడుదలవుతున్న మా సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది' అని నిర్మాత బాలకృష్ణ ఆకుల చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ రవిమేకల మాట్లాడుతూ,'ట్రైలర్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.